ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలోని యూనిట్లలో ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ నెల 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
www.hqscrecruitment.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం పదో తరగతి పాసైన వాళ్లు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కనీసం ఏడాది అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏడవ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం గరిష్టంగా 56900 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం ఉండటంతో నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ తో పాటు జనరల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన రాతపరీక్షను నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని తెలుస్తోంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రాతపరీక్ష ద్వారా సులువుగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.