డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

డిగ్రీ అర్హత ఉండి సరైన జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఇండియన్ ఆర్మీ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. గ్రాడ్యుయేషన్ అర్హతతో డిఫెన్స్ రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది. www.joinindianarmy.nic.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల గురించి తెలుసుకోవచ్చు.

జులై నెల 5వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగష్టు నెల 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. పెళ్లి కాని పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 55 ఉద్యోగ ఖళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్సీసీ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హతలను కలిగి ఉంటారని చెప్పవచ్చు. 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. వెబ్ సైట్ లో ఆఫీసర్ ఎంట్రీ యాప్‌ఇన్ ఆప్షన్ ను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుంది. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికైన వాళ్లను ఈ ఉద్యోగాలలోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది.