రక్షణ దళాల్లో చేరాలని భావించే నిరుద్యోగులకు ఇండియన్ ఆర్మీ తీపికబురు చెప్పింది. ఇండియన్ ఆర్మీ లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఇండియన్ ఆర్మీ, టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. అధికారిక పోర్టల్ ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.
నాలుగు టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కంప్యూటర్ సైన్స్ లేదా సైబర్ సెక్యూరిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు.
కనీసం మూడేళ్ల అనుభవం ఉండి ఇండిపెంటెండ్ కన్సల్టెంట్‌గా పనిచేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట శారీరక, వైద్య ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలను కలిగి ఉండాలి. www.jointerritorialarmy.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
టెరిటోరియల్ ఆర్మీ అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో నిర్ణీత గడువులోపు దరఖాస్తు ఫారమ్ ను పంపాల్సి ఉంటుంది. డైరెక్టరేట్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ, ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 4వ అంతస్తు, ఏ బ్లాక్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫీస్ కాంప్లెక్స్, కేజీ మార్గ్, న్యూ ఢిల్లీ-110001 అడ్రస్ కు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.