నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ ఆర్మీలో భారీ వేతనంతో అగ్నివీర్ ఉద్యోగ ఖాళీలు?

ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. డిఫెన్స్ రంగంలో భారీగా రిక్రూట్‌మెంట్స్ దిశగా ఆర్మీ అడుగులు వేస్తోంది. తాజాగా అగ్నివీర్‌ వాయు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల కాగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీగా బెనిఫిట్ కలగనుంది. agnipathvayu.cdac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఇంటర్ లో కనీసం 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. మూడేళ్ల డిప్లొమా కోర్సు చేసిన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఇంగ్లీష్ లో కనీసం 50 శాతం మార్కులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. agnipathvayu.cdac.in వెబ్ సైట్ లో రిక్రూట్‌మెంట్ సెక్షన్‌పై క్లిక్ చేసి అందులో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

రిజిస్టర్ ఐడీ సాయంతో లాగిన్ కావడంతో పాటు దరఖాస్తును పూర్తి చేసి అవసరమైన వివరాలను నింపి ఫీజు చెల్లించాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.

అక్టోబర్ 13వ తేదీ నుంచి రాత పరీక్షలు మొదలుకానుండగా సైన్స్ సబ్జెక్ట్ అభ్యర్థులకు ఒక విధంగా ఇతర అభ్యర్థులకు ఒక విధంగా పరీక్షలు ఉంటాయి. పరీక్షల కోసం రిలీజైన అడ్మిట్ కార్డ్ ను కలర్ ప్రింట్ తీసుకొని పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.