ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. రైతుల నుండి వ్యాపారస్తుల వరకు బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరపవచ్చు. డబ్బు డిపాజిట్ చేయటానికి,లేదా విత్ డ్రా చేయటానికి బ్యాంక్ కి వెళ్లాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, కొన్ని బ్యాంకులో ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉద్దేశపూర్వకంగా పనిని వాయిదా వేస్తూ ఉంటారు. మరికొన్ని సందర్భాలలో బ్యాంకు ఉద్యోగులు ఆలస్యంగా రావడంతో ఇలా పలు కారణాల వల్ల ప్రజలు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే బ్యాంక్ ఉద్యోగస్తుల మీద ఫిర్యాదు చేయవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తో పాటు లోక్‌పాల్ లేదా వినియోగదారుల ఫోరమ్‌లో బ్యాంక్ ఉద్యోగస్తుల మీద ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంక్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగస్తుల మీపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బ్యాంక్ లో ఉన్న ఫిర్యాదు నంబర్ కి ఫోన్ చేసి ఉద్యోగస్తులపై ఫిర్యాదు చేయవచ్చు. అలాగే మీరు https://cms.rbi.org.in వెబ్‌సైట్ ద్వారా కూడా బ్యాంక్ ఉద్యోగస్తుల పని తీరు గురించి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.బ్యాంకు లో ఉద్యోగస్తులు తమ సీటులో కాకుండా వేరే సీటుకు వెళ్లి, వేరే ఉద్యోగితో ఎక్కువ సేపు మాట్లాడుతుంటే, మీరు అంబుడ్స్‌మన్, ఆర్‌బీఐ లేదా ఆ బ్యాంకు కేంద్ర కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న బ్యాంక్ లోనైన ఉద్యోగస్తులు కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తించటం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఆర్‌బిఐకి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే మీరు ఏదైనా బ్యాంకుపై ఫిర్యాదు చేయాలనుకుంటే, https://cms.rbi.org.in వెబ్‌సైట్ లో లాగిన్ అయ్యి ఫిర్యాదు చేయవచ్చు. దీనితో పాటు, మీరు CRPC@rbi.org.inకి కూడా ఇమెయిల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మీరు భారతదేశంలోని ఏ మూల నుండి అయినా టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయడం ద్వారా సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయవచ్చు.