హైదరాబాద్ లోని బెల్ లో భారీ వేతనంతో ఉద్యోగాలు.. నెలకు రూ.90 వేల వేతనంతో?

హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. అసిస్టెంట్‌ ట్రెయినీ, జూనియర్‌ అసిస్టెంట్‌,టెక్నీషియన్‌-సీ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2024 సంవత్సరం జులై 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 32 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ట్రేడ్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 17 టెక్నీషియన్ సి ఉద్యోగ ఖాళీలను, 12 ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలను 3 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.

2024 సంవత్సరం జూన్ 1వ తేదీ నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మేన్ లకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టుకు రూ.24500 నుంచి రూ.90000 లభించనుండగా టెక్నీషియన్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.21500 నుంచి రూ.82000 లభించనుంది.

జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలు కాగా ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ లకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.