ప్రామిసరీ నోటు, పత్రం లేకుండా అప్పు తీసుకున్నారా.. ఆ అప్పును ఎలా రాబట్టాలంటే?

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఎలాంటి హామీ లేకుండా ఇతరులకు అప్పు ఇస్తుంటారు. కొంతమంది ఆ అప్పును సరిగ్గా రిటర్న్ చేస్తే మరి కొందరు మాత్రం ఆ అప్పును రిటర్న్ చేయడానికి అస్సలు ఆసక్తి చూపరు. అయితే ఇలాంటి సందర్భాలలో అప్పును వసూలు చేసుకునే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇచ్చిన అప్పును వసూలు చేసుకోలేక కొంతమంది ఆ అప్పును కట్టలేక నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ డబ్బును మరిచిపోవాల్సి వస్తుంది. అయితే ఈ పరిస్థితి రిప్ట్ కాకుండా ప్రామిసరీ నోటు, పత్రం లేకుండా తీసుకున్న అప్పును రాబట్టడం కోసం అవతలి వ్యక్తులకు నోటీసులను పంపించాల్సి ఉంటుంది. అవతలి వ్యక్తి అప్పు తీసుకున్నానని తిరిగి చెల్లిస్తానని సమాధానం ఇస్తే ఎలాంటి సమస్య లేదు. అప్పు తీసుకోలేదని దబాయిస్తే మాత్రం కాల్స్, వాట్సాప్ చాట్, ఇతర ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఎంత నమ్మకస్తులైనా అధిక వడ్డీకి ఆశ పడి గుడ్డిగా డబ్బులు ఇస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. అప్పును తీర్చే విషయంలో ఇబ్బందులు ఎదురైతే మనం ఆర్థికంగా ఇబ్బందులు పడే అవసరం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం అప్పు ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రం సరైన ఆధారాలు ఉంటే మాత్రమే అప్పు ఇస్తే మంచిది. ఇచ్చిన అప్పును వసూలు చేసుకునే సామర్థ్యం ఉంటే మాత్రమే అప్పు ఇవ్వాలి.

ప్రస్తుత కాలంలో డబ్బుల విషయంలో ఎవరినీ నమ్మే పరిస్థితులు అయితే లేవని గుర్తుంచుకోవాలి. అప్పు ఇచ్చే వ్యక్తుల ఆర్థిక వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకుని మాత్రమే అప్పు ఇవ్వాలి. అప్పు ఇచ్చే విషయంలో పొరపాట్లు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని గుర్తుంచుకోవాలి.