కేంద్ర ప్రభుత్వం తీపికబురు.. సులువుగా ఉచితంగా రూ.15,000 పొందే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రూ.15,000 అందిస్తుండగా అర్హత ఉన్నవాళ్లను ఈ డబ్బులను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

రకరకాల వృత్తులు చేపడుతున్న వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు కాగా ఈ స్కీమ్ ద్వారా కేంద్రం నుంచి 15000 రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా రుణం కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 18 సంవత్సరాలు దాటి చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్న వాళ్లందరూ ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది.

గడిచిన 5 సంవత్సరాలలో ఇలాంటి ఇతర స్కీమ్స్ లో రుణాలు తీసుకోని వాళ్లు ఈ స్కీమ్ ద్వారా సులువుగా రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే మాత్రం ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడం వీలు కాదని చెప్పవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు కేంద్రం నుంచి విశ్వకర్మ సర్టిఫికెట్ లభించే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఐడీ కార్డ్ తో పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వా టూల్ కిట్ ను కొనుగోలు చేయడానికి 15,000 రూపాయలు పొందవచ్చు. 18 నెలల్లో లక్ష రూపాయల వరకు రుణం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా రుణం తీసుకోవడం ద్వారా సొంతంగా షాపు పెట్టుకోవచ్చు.