తల్లిదండ్రులు అలర్టు చిన్నారులలో పెరుగుతున్న హెపటైటిస్ కేసులు?

హెపటైటిస్ అనేది ముఖ్యంగా లివర్ కి వచ్చే వ్యాధి. కలుషితమైన, నీరు ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ఎంతోమంది హెపటైటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని 35 దేశాలలో ఈ వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటివరకు దాదాపు 1000 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఈ హెపటైటిస్ వ్యాధి ఒకటి నుండి ఐదు సంవత్సరాలలోపు వయసు గల పిల్లల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.

ఈ వ్యాధి వ్యపించటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఈ హెపటైటిస్ వ్యాధి సోకినప్పుడు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, విరేచనాలు, కీళ్ల నొప్పులు, ఆకలి మందగించటం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ హెపటైటిస్ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ శాతం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతోంది. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు నమోదైన హెపటైటిస్ కేసుల్లో సగం కేసులు యూరోప్‌ లోనే నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పిల్లలలో హెపటైటిస్ వ్యాధి సోకుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో ఏప్రిల్ 5వ తేదీన తొలిసారి గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు హెపటైటిస్ వల్ల 22 మంది మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది.

పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా 1 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాధికి ప్రమాదం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఎల్లప్పుడు పిల్లలకు శుభ్రమైన నీటిని ఆహార పదార్థాలను అందిస్తూ వారిపట్ల జాగ్రత్త వహించాలి . లేదంటే పెద్ద ప్రమాదం ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల పిల్లలలో ఈ వ్యాధి లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా కూడా అప్రమత్తమై వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించాలని డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు వెల్లడించారు.