Heart Racing: గుండె వేగం పెరగడం.. అనారోగ్యానికి సంకేతమా..!

ఒక్కసారిగా మన గుండె ఊహించని వేగంతో కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పుడు.. లేదా భయంతో హఠాత్తుగా గుండె చప్పుడు పెరిగిన అనుభవం మీకెప్పుడైనా కలిగిందా.. అలాంటి సందర్భాల్లో మనం అనేక మంది “గుండె బలంగా కొడుతోంది”, “ఏదో అయిపోతుందేమో అనిపిస్తోంది” అనే భావనలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇది శరీరంలోని ఒక సహజ ప్రతిచర్య అయినా, కొన్ని సందర్భాల్లో ఇది అనారోగ్యానికి సంకేతంగా కూడా మారవచ్చు.

సాధారణంగా ఒక ఆరోగ్యకర వ్యక్తి హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ (BPM) మధ్యలో ఉండాలి. కానీ అది 100 BPM కన్నా అధికంగా ఉంటే, వైద్య భాషలో దాన్ని టాచీకార్డియా అంటారు. దీనికి కారణం ఏమిటి..? ఇది నిజంగా ప్రమాదకరమా అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

మనం భయం, ఒత్తిడి, ఉద్వేగాలు, గందరగోళ ఆలోచనలతో చుట్టుముట్టబడ్డప్పుడు, శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్లు ఉధృతంగా విడుదల అవుతాయి. ఈ హార్మోన్లు శరీరాన్ని అపాయ సూచనలతో రెడీ చేస్తాయి. అలా హెచ్చరిక మోడ్‌లోకి వెళ్లిన శరీరం హృదయ స్పందనను వేగవంతం చేస్తుంది. ఈ స్థితి తాత్కాలికమే అయినా, దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం జాగ్రత్త అవసరం.

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. “ఒక వేళ ఆలోచించేటప్పుడు గుండె వేగంగా కొట్టడం ప్రతి సారి సమస్య అనుకోనవసరం లేదు.. ఇది మానసిక ఆరోగ్యం లేదా గుండె సంబంధిత వ్యాధుల సంకేతం కావచ్చు. ప్రత్యేకంగా థైరాయిడ్ సమస్యలు, ఎక్కువ క్యాఫిన్ తీసుకోవడం, మైకము, ఛాతీ నొప్పి, తీవ్రమైన చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కలిగితే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇక నుంచి గుండె వేగంగా కొట్టినప్పుడు “బయపడాల్సిన సమయం వచ్చిందా?” అనే ప్రశ్నకు సమాధానం ఈ విధంగా ఉండాలి – అది ఒక్కోసారి సహజమే, కానీ తరచూ జరిగితే.. అది శరీరం ఇచ్చే హెచ్చరిక కూడా కావచ్చు. అలాంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. అలానే, మనసులో ఉండే భయాలను సైతం అర్థవంతంగా నిర్వహించండి. ఎందుకంటే.. హృదయం విన్నపాలు వినిపించదు, కానీ సంకేతాలుగా స్పష్టంగా తెలియజేస్తుంది.