ఒక మనిషి జీవితంలో డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ భూమి మీద మనిషి మనుగడ సాగించటానికి డబ్బు చాలా అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చవుతుంది. దీంతో ఆర్థిక సమస్యల వల్ల ఇల్లు గడవడం చాలా కష్టంగా మారిపోతుంది . ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కటానికి కష్టపడి పనిచేయటమే కాకుండా కొన్నివాస్తు చిట్కాలు కూడా పాటించాలి. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా కూడా ఆర్థిక సమస్యలు తలెత్తటానికి వాస్తు దోషాలు కూడా ఒక కారణం కావచ్చు. వాస్తు చిట్కాలు పాటించి ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చు. వాస్తు ప్రకారం ఈశాన్య దిశ మనకు లాభాలు కలిగించే దిక్కుగా భావించవచ్చు. ఈశాన్య మూల పెరిగితే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో కుబేర యంత్రం ఉంచి పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు రావు. అలాగే ఇంట్లో పూజ గది కూడా సరైన దిశలో ఉండాలి. ఈశాన్య దిశలో పూజా గది ఉంటే డబ్బుకు బాధలు ఉండవు.
ఇంట్లో అన్ని గదులు వాస్తు ప్రకారం ఉండటమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఉండాలి. ముఖ్యంగా డబ్బులు దాచుకునే బీరువా, లాకర్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇంట్లో బీరువా ఎప్పుడు కూడా నైరుతి దిశలో ఉంచుకోవాలి. తలుపు తెరిస్తే ఉత్తరం వైపు ఉండేలా చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. నైరుతి దిశలోనే బీరువా ఉంచుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నైరుతి దిశలో బీరువా ఉంచటం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలకు స్థానం ఉండదు. అయితే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉన్న బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశాన్ని పూజించటం వల్ల ధన లాభం చేకూరుతుంది.