పది అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇండియన్ నేవీలో భారీ వేతనంతో?

Job-Vacancy

ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పదో తరగతి అర్హతతో భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కుక్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ను భర్తీ చేయనున్నారు. మొత్తం 9 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 63,200 రూపాయల వేతనం లభించనుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు కొచ్చిలోని హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌ లో ఉన్న యూనిట్లలో పని చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. కొచ్చి యూనిట్ లో 5 పోస్టుల భర్తీ జరగనుండగా మిగతా యూనిట్లలో 4 పోస్టుల భర్తీ జరగనుంది. 56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

కుక్ ట్రేడ్ లో ఏడాది అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, (సివిలియన్ రిక్రూట్‌మెంట్ సెల్), హెడ్‌క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్, కొచ్చి – 682 004 అడ్రస్ కు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది. అవసరమైన డాక్యుమెంట్లను జత చేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలిగే అవకాశం అయితే ఉంటుంది.