వృద్ధులకు అదిరిపోయే శుభవార్త.. ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ.20,000 పొందొచ్చట!

మనలో చాలామంది వయస్సు పెరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో ఏకంగా 30 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది.

ఈ స్కీమ్ లో 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా నెలకు 20,000 రూపాయల పెన్షన్ సులువుగా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి 8 శాతం వడ్డీ లభిస్తుంది. 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఏడాదికి ఏకంగా 2.5 లక్షల రూపాయలు వడ్డీ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. ఐదు సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉండగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను ఆ తర్వాత పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మరో మూడు సంవత్సరాల పాటు పొడిగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఇందులో పెట్టుబడులు పెడితే మంచిది. ఈ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్ చేకూరనుంది. సీనియర్ సిటిజన్ స్కీమ్ అన్ని వర్గాల వాళ్లకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.