ఇంటర్ పాసైన వాళ్లకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండా రూ.90 వేల వేతనంతో జాబ్స్!

ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగే విధంగా వరుస జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లా కోర్టుల్లో పని చేయడం కోసం స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్, కాపీయిస్ట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. టైపిస్ట్ ఉద్యోగ ఖాళీలు 144 ఉండగా కాపీయిస్ట్ ఉద్యోగ ఖాళీలు 84, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 96 ఉన్నాయి. స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. జూన్ నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://tshc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 324 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. కనీసం ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

టైపింగ్ లో సర్టిఫికెట్ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 34 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి. దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం 600 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 400 రూపాయలుగా ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు గరిష్టంగా 96,890 రూపాయల వరకు వేతనంగా లభించనుంది. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.