10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.4,400 డిస్కౌంట్.. ఎక్కడ కొనాలో తెలుసా?

gold

మహిళల్లో బంగారం అంటే ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరనే సంగతి తెలిసిందే. బంగారం తక్కువ ధరకు లభిస్తే కొనుగోలు చేయడానికి మహిళలు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం 24 క్యారెట్ బంగారం ధర 62400 రూపాయలు ఉండగా 22 క్యారెట్ బంగారం ధర 57200 రూపాయలుగా ఉంది. గత కొన్ని నెలల్లో బంగారం ధర ఊహించని విధంగా పెరగడంతో బంగారం కొనుగోలు చేసేవాళ్లు టెన్షన్ పడుతున్నారు.

 

అయితే సావరిన్ గోల్డ్ బాండ్ ను తక్కువ ధరకే కొనే అవకాశం అయితే ఉంది. ఆర్బీఐ ఈ బాండ్స్ ను విక్రయిస్తుండగా డీమ్యాట్ అకౌంట్లు ఉన్నవాళ్లు సావరిన్ గోల్డ్ బాండ్స్ ద్వారా బంగారాన్ని సులువుగా కొనుగోలు చేయవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ కోసం కేవలం 58,010 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని సమాచారం. బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావించే వాళ్లు సావరిన్ గోల్డ్ బాండ్ లో పెట్టుబడులు పెట్టవచ్చు.

 

గోల్డ్ బాండ్స్ ఎప్పుడు మెచ్యూర్ అవుతాయో తెలుసుకుని వాటిపై ఇన్వెస్ట్ చేస్తే మంచిది. సెకండరీ మార్కెట్ లో గోల్డ్ బాండ్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఈ బాండ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నవాళ్లు ఈ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. సర్టిఫికెట్ రూపంలో ఉండే ఈ గోల్డ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

 

ప్రతి గోల్డ్ బాండ్ ను లాకిన్ పీరియడ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. సావరిన్ గోల్డ్ బాండ్ గురించి పూర్తి స్థాయిలో అవగహన కలిగి ఉంటే ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఫిజికల్ గోల్డ్ వెంటనే కావాల్సిన వాళ్లు మాత్రం ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టకపోతే మంచిది.