గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గెయిల్ అధికారిక పోర్టల్ విజిట్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ నెల 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
గెయిల్ నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఏకంగా 391 పోస్టుల భర్తీ జరగనుందని తెలుస్తోంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం జరగనుంది. పోస్టుల ఆధారంగా విద్యార్హతలు వేర్వేరుగా ఉండగా జూనియర్ ఇంజనీర్ అండ్ ఫోర్‌మెన్ ఉద్యోగాలకు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో డిప్లొమ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అర్హత కలిగి ఉంటారు.
ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫోర్‌మెన్ పోస్టులకు రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ కచ్చితంగా ఉండాలని చెప్పవచ్చు. జూనియర్ సూపరింటెండెంట్(హిందీ) ఉద్యోగ ఖాళీలకు సాహిత్యం/హిందీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిన వాళ్లు అర్హులు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వాళ్లు జూనియర్ కెమిస్ట్ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.
కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఆపరేటర్ కెమికల్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు ఒక సంవత్సరం వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
www.gailonline.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గెయిల్ నాన్ – ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్-2024 లింక్ ద్వారా నోటిఫికేషన్ వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్లై నౌ అనే ఆప్షన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ కావడంతో పాటు రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ ను ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.