ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ వెటర్నరీ అంబులెన్సు సర్వీస్ మెడికల్ అంబులెన్స్ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి పాసైన వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పశువులకు, మూగజీవులకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో డాక్టర్ వైఎస్సార్ వెటర్నరీ అంబులేటరీ సర్వీస్ అంబులెన్సు సర్వీస్ లను మొదలుపెట్టడం జరిగింది.
ఈ ఆంబులెన్స్ లలో వెటర్నరీ డాక్టర్, పారావెట్ అనే పశు వైద్యులు అందుబాటులో ఉండటంతో పాటు డ్రైవర్లు కూడా అవసరం కాగా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. బీవీఎస్సీ, ఎంవీఎస్సీ చేసిన వాళ్లు పశు వైద్యుల ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా పశు వైద్యులుగా ఎంపికైన వాళ్లకు నెలకు రూ.36 వేల వేతనం, మెడికల్ ఇన్సూరెన్స్, పీఎఫ్ సదుపాయం లభించే అవకాశాలు అయితే ఉంటాయి.
వెటర్నరీలో డిప్లొమా చేసిన వాళ్లు పారావెట్ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 15,000 రూపాయల వేతనం లభించే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా లభిస్తుంది. పదో తరగతి చదివి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 36 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు డ్రైవర్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
డ్రైవర్లుగా ఎంపికైన వాళ్లకు 12 వేల రూపాయల వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి బెనిఫిట్స్ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.