అవాంచిత రోమాలతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కా మీకోసమే!

అమ్మాయిలలో అవాంచిత రోమాలు అంతులేని వేదనకు గురిచేస్తాయి. అవాంచిత రోమాలు రావడానికి వారిలో హార్మోన్ల సమస్య. ఇవి కాళ్లపై, చేతులపై, ముఖంపై వచ్చి కాస్త అందహీనంగా కనపడడం జరుగుతుంది. వీటిని తొలగించడం కోసం రకరకాల క్రీములు వాడి చర్మ సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుంది.

కొందరు అయితే హెయిర్ సెలూన్ల, బ్యూటీ పార్లర్ళ చుట్టూ తిరిగి తంటలు పడుతుంటారు. అయితే సులువుగా ఇంట్లో దొరికే సహజ పదార్థాల వల్ల వీటిని శాశ్వతంగా తొలగించుకోవచ్చు. రెండు టీ స్పూన్ల శెనగపిండి, చిటికెడు పసుపు, వేడి చేసి చల్లార్చిన పాలు వేసి పేస్టులాగా చేసుకుని అవాంచిత రోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి.

అరగంట తర్వాత మంచినీటితో కడిగేస్తే అవాంచిత రోమాలు రాలిపోతాయి. ఒక గ్లాసు వాటర్ లో రెండు స్పూన్ల చక్కెర వేసి బాగా మరిగించాలి. బాగా పాకం లాగా వచ్చిన తర్వాత అందులో ఒక నిమ్మకాయ రసం పిండి మొఖంపై అప్లై చేసుకుని ఎండిన తర్వాత తీసేస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండు స్పూన్ల శెనగపిండి, చిటికెడు పసుపు, ఒక స్పూన్ వేపాకు పొడి, సరిపడినంత పచ్చిపాలును పేస్ట్ లాగా చేసుకుని అవాంచిత రోమాలు ఉన్న ప్రదేశంలో రెండు లేదా మూడు నిమిషాలు మర్దన చేసుకుని అరగంట తర్వాత మంచి నీటితో కడుక్కుంటే మంచి ఫలితం చూడవచ్చు.

రెండు స్పూన్ల పచ్చి బొప్పాయి పండు గుజ్జు, ఒక స్పూన్ కలబంద గుజ్జు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ శనగపిండి వేసి పేస్ట్ లాగా చేసుకుని అవాంచిత రోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకుని రెండు లేదు మూడు నిమిషాలు మర్దన చేసి అది ఎండిన తర్వాత శుభ్రంగా కడిగితే మంచి ఫలితం ని గమనించవచ్చు.

చూశారుగా ఫ్రెండ్స్ ఈ సింపుల్ చిట్కాలతో అవాంచిత రోమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేయొచ్చు. రకరకాల ప్రయత్నాలు చేసి చర్మ సమస్యలు తెచ్చుకోవడం కంటే ఈ సహజ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం పొందవచ్చు.