మనలో చాలామంది వేరుశనగను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. బాదం, జీడిపప్పు కంటే తక్కువ ధరకే మనకు వేరుశనగ లభిస్తుంది. వేరుశనగ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరుతాయి. మన దేశ ప్రజలు వేరుశనగను విరివిగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. వేరుశనగలో ఎక్కువ పోషకాలు ఉండగా వేరుశనగ తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి.
కండరాల పెరుగుదలకు, కండరాల మరమ్మత్తుకు వేరుశనగలో ఉండే ప్రోటీన్లు ముఖ్యమనే సంగతి తెలిసిందే. మోనో శాచురేటెడ్ ఫ్యాట్, పాలీ శాచురేటెడ్ ప్యాట్ పుష్కలంగా వేరుశనగలో ఉండగా ఇవి తీసుకోవడం వల్ల గుండెకు సైతం ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. వేరుశనగలో పైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటంతో పాటు ఆకలి నియంత్రణలో ఉంటుంది.
వేరుశనగలో విటమిన్-బి3 ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు సమృద్దిగా వేరుశనగలో ఉండటం వల్ల ఆకలిగా ఉన్న సమయంలో వీటిని తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. వేరుశనగలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశనమం లభించే అవకాశాలు అయితే ఉంటాయి.
వేరుశనగలలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్ ఉండగా ఎముకలను బలంగా మార్చడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి తోడ్పడతాయి. వేరుశనగ తీసుకోవడం ద్వారా శరీరానికి లాభమే తప్ప నష్టం లేదు. అయితే ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా పరిమితంగా తీసుకుంటే మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.