పౌర్ణమి రోజు మిస్ కాకుండా ఇలా చేయండి.. కుబేరులు అవ్వండి!

పౌర్ణమి అనేది నిండు చంద్రుడు లాంటిది. కొన్ని పద్ధతులను పాటిస్తూ చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అప్పుల బాధలు, వ్యాపార నష్టాలు, చదువు సమస్యలు, పెళ్లి కాకపోవడం ఇలా ఏవైనా సమస్యలు ఉంటే ఆరోజు చేసే పూజ ద్వారా తొలగిపోతాయి.

పౌర్ణమి రోజున ఉదయం తలస్నానం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం సూర్యాస్తమం టైంలో బియ్యంతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇందులో చక్కెర కాకుండా బెల్లాన్ని వాడితే మంచిది. తరువాత అరటిపండును చక్రాల కోసి ఇందులో వేయాలి. ఆరోగ్యం బాగా ఉన్నవారే ఉపవాసం ఉండాలి.

ఇక పూజ గదిలో ఈ నైవేద్యం పెట్టి 101 సార్లు అమ్మవారి ముందు లక్ష్మీ స్తోత్రాన్ని ప్రకటించాలి. ఒకసారి పూర్తి అయినాక కుంకుమ లేదా అక్షింతపు గింజలను అమ్మవారి ముందు పెట్టాలి. పూజ ప్రారంభించే ముందే మన ఇంట్లో ఏదైతే పెద్ద సమస్య ఉందో అది నెరవేలాలి అని మనసులో అమ్మవారికి దండం పెట్టుకుని పూజను మొదలుపెట్టాలి. ఇక ఈ మొత్తం పూర్తి అయిన తర్వాత పంచాక్ష దీపారాధన చేయాలి.

అంటే ఐదు దీపాలను వెలిగించి హారతి ఇవ్వాలి. ఇందుకు కర్పూరం కాకుండా వత్తులను వినియోగించాలి. పూజ అయిపోయిన తర్వాత కాసేపు తలుపులు మూసేసి, చక్కగా చదువుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత తలుపులు తెరిచి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఇది ఇతరులకు పెట్టకూడదు కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాలి.

ఇక రాత్రంతా ఉపవాసంలో ఉండి నైవేద్యం మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఇలా చక్కగా పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేసుకుంటే అన్నీ కలహాలు తీరిపోతాయి. ఎప్పటినుండో వెంటాడుతున్న సమస్యలు ఇట్టే పరిష్కారం అవుతాయి.