వాటర్ బాటిల్స్ మీద వంకర్లు ఉండటానికి గల అసలు కారణమేమిటో తెలుసా..?

సాధారణంగా బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ కొన్ని నీరు తాగుతూ ఉంటారు. అయితే వాటర్ బాటిల్స్ కొన్న తర్వాత చాలామంది వాటిని తాగి పారేస్తూ ఉంటారు. అయితే వాటి మీద కొన్ని వంకరగా గీతలు ఉంటాయి చాలామంది వాటిని గమనించి ఉండరు. అయితే వాటర్ బాటిల్స్ మీద వంకరగా గీతలు ఉండటానికి కూడా ఒక కారణం ఉంది. ఏ కంపెనీకి చెందిన వాటర్ బాటిల్స్ అయినా సరే పై భాగంలో కొంచెం వంకరగా ఉంటుంది. అయితే బాటిల్స్ మీద ఇలా గీతలు ఉండటానికి కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా వాటర్ బాటిల్స్ ని తయారు చేయటానికి ఉపయోగించే ప్లాస్టిక్ చాలా మృదువుగా ఉంటుంది. వీటిని చేతితో పట్టుకొని నలిపిన కూడా అవి కాగితం లాగా నలిగిపోతాయి. అందువల్ల వాటర్ బాటిల్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండటానికి వాటి మీద ఇటువంటి గీతలు ఉంచుతారు. ఇలాంటి గీతలు వాటర్ బాటిల్స్ కి బలాన్ని ఇస్తాయి. వాటర్ బాటిల్స్ మీద ఈ లైన్లు లేకపోతే అవి సులభంగా వంగిపోతాయి. అంతే కాకుండా బాటిల్ కిందపడిన వెంటనే పగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మీద వంకరగా లైన్లు ఉండేలా తయారు చేస్తారు.ఇవి బాటిల్స్ ని దృఢంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. మరి కొన్ని వాటర్ బాటిల్స్ ని దృఢమైన ప్లాస్టిక్తో తయారుచేస్తారు వాటి మీద ఇటువంటి లైన్స్ లేకపోయినా కూడా అవి దృఢంగా ఉంటాయి.

అంతేకాకుండా వాటర్ బాటిల్స్ మీద ఇటువంటి లైన్లు ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది. సాధారణంగా కొన్ని కంపెనీలు స్టైల్ కోసం కూడా వాటర్ బాటిల్స్ మీద రకరకాల డిజైన్లతో గీతలు వేస్తూ ఉంటారు. వాటర్ బాటిల్స్ మీద ఇలా గీతలు వేయటానికి మరొక కారణం కూడా ఉంది. సాధారణంగా ప్లాస్టిక్ బాటిళ్లు చాలా నునుపుగా ఉంటాయి అందువల్ల వీటిని పట్టుకున్నప్పుడు అవి జారిపోతూ ఉంటాయి. అలా బాటిల్స్ ని పట్టుకున్నప్పుడు చేతి నుండి జారిపోకుండా గ్రిప్ కోసం కూడా వాటర్ బాటిల్స్ మీద గీతలు ఉండేలా తయారుచేస్తారు.