హోటల్ రూమ్స్ లో తెల్ల బెడ్ షీట్లు మాత్రమే ఉపయోగించటానికి గల కారణం ఏమిటో తెలుసా..?

సాధారణంగా ఎక్కడైనా సుదూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తెలిసినవారు ఎవరూ లేకపోతే అక్కడ ఉండటానికి తప్పనిసరిగా హోటల్ లో బస చేయవలసి వస్తుంది. అయితే ఇలా హోటల్స్ కి వెళ్ళినప్పుడు మనం హోటల్ రూమ్ లో బెడ్ షీట్లు, టవర్లు, నాప్కిన్స్ అన్నీ కూడా మొత్తం తెలుపు రంగులో కనిపిస్తాయి. అయితే మనం వాటిని గమనించిన కూడా దాని వెనుక గల కారణం గురించి మాత్రం తెలుసుకోవాలని ప్రయత్నించము. అయితే ఇలా హోటల్ రూమ్స్ లో కేవలం తెల్లటి బెడ్ షీట్లు మాత్రమే ఉపయోగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ కారణాల గురించి తెలుసుకుందాం.

తెల్లని దుస్తులతో హోటల్ రూమ్ ను డెకరేట్ చేయడం ద్వారా ఆ రూమ్స్ కి రిచ్ లుక్ వస్తుంది. అంతేకాకుండా మొత్తం ఇలా తెలుపు రంగుతో రూమ్ నైట్ డెకరేట్ చేయటం వల్ల అందులో ఉండటానికి కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెలుపు రంగు శాంతికి చిహ్నంగా ఉంటుంది. తెలుపు రంగు మనస్సును ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుతుంది. అలాగే తెల్లని వస్తువులు చాలా త్వరగా మాసిపోతాయి. మరకలు సులభంగా కనిపిస్తాయి. కాబట్టి హోటళ్లలో తెల్లటి బెడ్ షీట్లను ఉపయోగిస్తారు. ఇతర రంగు బెడ్ షీట్లు మోసపోయిన కూడా కనిపించవు అలాంటి సమయంలో హోటల్ యాజమాన్యం వారు వాటిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. దీంతో కస్టమర్లు కూడా హోటల్లో బస చేయడానికి ఆసక్తి చూపరు.

హోటల్ రూమ్ లో ఉన్న తెల్లటి బెడ్ షీట్ శుభ్రంగా ఉంటే.. హోటల్ రూమ్ కూడా శుభ్రంగా ఉన్నట్లు కస్టమర్లు భావిస్తారు. దీంతో కస్టమర్లు గదిలో ఉండటానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా హోటల్ రూమ్స్ లో తెల్లటి బెడ్ షీట్లు మాత్రమే ఉపయోగించటానికి మరొక కారణం కూడా ఉంది. ప్రతిరోజు హోటల్లోని బెడ్ షీట్లు క్లీన్ చేసే సమయంలో మొత్తం బెడ్ షీట్స్ అన్నీ కలిపి ఉతుకుతుంటారు. అలా చేసే సమయంలో కలర్ పోకుండా, అంటుకోకుండా ఉండేందుకు తెల్లని దుస్తులను ఉపయోగిస్తుంటారు. ఏది ఏమైనా హోటల్ గదిలో తెల్లటి బెడ్ షీట్లు, టవల్లు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.