భార్య భర్తల జీవితం నాశనం కావడానికి ఇవే ప్రధాన కారణాలని తెలుసా?

Family-Demands-Husband-wife-fight

ఈ రోజుల్లో భార్యాభర్త విడిపోవడానికి బలమైన కారణం అంటూ ఏమీ అవసరం లేదు ఏవో సిల్లి రీజన్స్ తో విడిపోయే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.భార్యాభర్తలు విడిపోవడానికి ఎవరికి తోచిన కారణాలు వారు చెప్పుకుంటారు.మీ వైవాహిక జీవితంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బంధాలకు విలువనిచ్చి సాగిపోయే
వైవాహిక జీవితం ఎక్కువకాలం సుఖసంతోషాలతో కొనసాగుతుంది. అలాకాకుండా ఒకరినీ గురించి మరొకరు పట్టించుకోకుండా ఎవరికి తోచింది వారు చేసుకుంటూ వెళ్తే మీ దాంపత్య జీవనం స్వల్ప కాలంలోనే తనువు చాలించాల్సి ఉంటుంది. మీ దాంపత్య జీవనం సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే దంపతులిద్దరూ కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే.

భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇద్దరి ఇష్ట అయిష్టాలు, ఆర్థికపరమైన అంశాలు, కుటుంబ వ్యవహారాల పట్ల ఇద్దరికీ అవగాహన వచ్చే విధంగా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి.దాంపత్య జీవనంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇద్దరు కలిసి సమస్యను పరిష్కరించుకున్నప్పుడు బంధం మరింత బలపడుతుంది. అలాకాకుండా మీ భాగస్వామి పట్ల చిరాకు,కోపం,అసహ్యం వంటి లక్షణాలను ప్రదర్శిస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తి తక్కువ కాలంలోనే విడాకులకు దారి తీయవచ్చు.

ఈ రోజుల్లో ఎక్కువమంది కపుల్స్ విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం లేకపోవడమే. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలు ఉన్నప్పటికీ పడకగదిలో మాత్రం శారీరక తృప్తి చెందకపోతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి విడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి పడక గదిలో మీ భాగస్వామితో ఏకాంతంగా ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి.సహజంగా దంపతులిద్దరూ వైవాహిక జీవితంలో ఎక్కువ సమయం ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. కానీ ఈ రోజుల్లో సంసార సాగరాన్ని ఈదడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఆయన మీ పర్సనల్ లైఫ్ కంటూ ఒక టైం కేటాయించుకోవడం మంచిది అప్పుడే మీ దాంపత్య జీవనం సాఫీగా సాగిపోతుంది.ఇంట్లో భార్యాభర్త ఇద్దరు సమానం అనే భావన మర్చిపోకండి ఒకరి పైన ఒకరు పెత్తనం సాగించాలి అంటేఈరోజు కుదరదు దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగి మీ వైవాహిక జీవితం సర్వనాశనం అవుతుంది.