సీజనల్ వ్యాధులను ఎదుర్కోవాలంటే ఈ ఫ్రూట్స్ ను కచ్చితంగా తినాల్సిందే?

సహజ చల్లని వాతావరణం సమశీతోష్ణ మండలాల్లో మాత్రమే పండే కివి ఫ్రూట్ ఒకప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి అయితే ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొంది సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయి.పుల్లని రుచితో అధిక పోషకాల గనిగా పిలవబడే కివి ఫ్రూట్ ని చైనీస్ గూస్బెర్రీ అని కూడా అంటారు.కివి ఫ్రూట్ లో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సీ, ఈ, కే , పొటాషియం, కాల్షియం, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఇన్స్టాప్లమెంటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.

కివి ఫ్రూట్ ప్రత్యేకమైన తీపి, పులుపు రుచినీ కలిగి ఉంటుంది. అలాగే అధిక రసంతో ఉండి నారింజ , బత్తాయి పండ్ల కంటే అధిక మొత్తంలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కావున దీనిని ప్రతిరోజు మన ఆహారంలో తీసుకోగలిగితే మన శరీరానికి అవసరమైన పోషణతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.తద్వారా సీజనల్గా వచ్చే జ్వరం, దగ్గు ,జలుబు గొంతు నొప్పి, వంటి అనేక రకాల వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. కావున రోజువారి ఆహారంలో కివి ఫ్రూట్ ను ఆహారంలో తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

సీజనల్గా దోమల ద్వారా వచ్చే డెంగ్యూ ఫీవర్ మనలో ఎర్ర రక్త కణాలను నశింపజేస్తుంది. కివి ఫ్రూట్ ఎర్రరక్త కణాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. కావున ప్రతిరోజు ఒక కివి ఫ్రూట్ ను ఆహారంగా తీసుకుంటే ఎర్రరక్త కణాలు అభివృద్ధి చెంది ప్రమాదకర డెంగ్యూ ఫీవర్ ని ఎదిరించవచ్చు.

జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కివి ఫ్రూట్స్ నీ తినకపోవడమే మంచిది. కివిలో ఉండే యాసిడ్ లక్షణాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే తీవ్ర కిడ్నీ సమస్యలు ఉన్నవారు కివి ఫ్రూట్ కు దూరంగా ఉండాలి. కివిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కావున కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు పొటాష్ అధికంగా ఉన్న ఆహారాన్ని అస్సలు తినకూడదు.