ఇంటర్ అర్హతతో రక్షణ శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.81 వేల వేతనంతో?

రక్షణ మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, సీనియర్ స్టోర్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం 4 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుందని తెలుస్తోంది. ఆఫ్ లైన్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్ఛు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగ ఖాళీలు 3 ఉండగా సీనియర్ స్టోర్ కీపర్ ఉద్యోగ ఖాళీ 1 ఉంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 25500 నుండి రూ. 81100 వరకు వేతనం చెల్లిస్తారని సమాచారం అందుతోంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 12వ తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.

నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుండగా ఎక్కువ మొత్తం వేతనం ఆశించే వాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. రక్షణా శాఖలో ఉద్యోగం చేయాలని భావించే వాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెట్టవచ్చు.

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుండగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం వల్ల లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.