Condom: కండోమ్స్ కి ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా.. డేట్ ముగిసినవి వాడితే ఏమవుతుందో తెలుసా..?

లైంగిక ఆరోగ్యంపై ప్రజలకు ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతున్నప్పటికీ… కొన్ని విషయాల్లో ప్రజల్లో ఇంకా స్పష్టత లేదు. ముఖ్యంగా కండోమ్ వాడకంపై అనేక అపోహలు నెలకొన్నాయి. చాలా మంది కండోమ్‌ అంటే కేవలం గర్భధారణను నివారించే ఒక సాధనం అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ వాస్తవానికి ఇది లైంగికంగా వ్యాపించే వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పించే ఒక అత్యంత ముఖ్యమైన మార్గం.

AIDS, హెపటైటిస్ B, గోనోరియా, హెర్పీస్, సిఫిలిస్ లాంటి వ్యాధులు కండోమ్ వాడకంతో నివారించవచ్చు. కండోమ్‌ను సరైన పద్ధతిలో వాడితే దాని ప్రభావం 98 శాతం వరకూ ఉంటుంది. అయితే ఇది కూడా కచ్చితంగా వాడినపుడే సాధ్యమవుతుంది. పొరపాటుగా వాడటం.. ఎక్స్పైరీ డేట్ ముగిసిన కండోమ్ వాడితే వృథాగా మారిపోతుంది.
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతి కండోమ్‌కు గడువు తేదీ ఉంటుంది. ఈ తేదీని పట్టించుకోకుండా వాడితే అది చించిపోయే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా తడి లేదా వేడి ప్రదేశాల్లో ఉంచితే కండోమ్ నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి వాటిని ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉండే ప్రదేశాల్లో నిల్వ చేయాలి.

లేటెక్స్ లేదా పాలియురెతేన్ కండోమ్‌లు సాధారణంగా 5 సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయి. స్పెర్మిసైడ్ కలిగిన కండోమ్స్ ఎక్స్పైరీ డేట్ కేవలం మూడు సంవత్సరాలే. అలాగే బ్రాండెడ్ కండోమ్‌లను మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ISI లేదా CE వంటి ప్రమాణాలు ఉండే బ్రాండ్లు మాత్రమే భద్రతగా ఉంటాయి.

ఇవి వివి వినియోగించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక కండోమ్‌ను రెండోసారి వాడకూడదు. ప్యాకెట్ దెబ్బతిన్నట్లైతే వాడొద్దు. అలాగే గదిలో, కారులో, వాలెట్‌లో ఎక్కువకాలం ఉంచినా అవి వేడి వల్ల పాడవుతాయి. అంతేకాదు కండోమ్ సీల్ తెరిచిన వెంటనే వాడాలి. ఆలస్యం చేయకూడదు. లైంగిక ఆరోగ్యం మీద పూర్తి రక్షణ కావాలంటే.. కండోమ్‌ను సరైన రీతిలో, తాజావాటినే వాడాలి. అవగాహన కలిగి ఉండటమే ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా దీన్ని భావించి సరైన నిర్ణయం తీసుకోవాలి.