కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. రూ.65 పొదుపుతో చేతికి రూ.16 లక్షలు పొందే ఛాన్స్!

తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభాలను పొందాలని మనలో చాలామంది భావిస్తూ ఉంటారు. అలా భావించే వాళ్లకు ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ ను అందించే స్కీమ్స్ లో పీపీఎఫ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా మారుతుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడిని పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

15 సంవత్సరాల టెన్యూర్ తో ఈ స్కీమ్ అమలవుతుండగా ఐదేళ్ల చొప్పున టెన్యూర్ పొడిగించుకుంటూ వెళ్లి నచ్చినంత కాలం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ సైతం లభిస్తాయి. పెట్టిన డబ్బులు, వచ్చిన వడ్డీ, విత్‌డ్రా చేసే మొత్తంపై ఎలాంటి పన్నులు ఉండవని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతుండగా ఇన్వెస్ట్ చేసే మొత్తానికి మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తంలో పొందవచ్చు. నెలకు 1000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 8.2 లక్షల రూపాయలు పొందవచ్చు. నెలకు 2,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్లకు రూ.10 లక్షలకు పైగా పొందే అవకాశం ఉంటుంది. 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే రూ. 16 లక్షలకు పైగా పొందవచ్చు.

పోస్టాఫీస్ బ్రాంచ్ ల ద్వారా ఈ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంది. దీర్ఘకాలంలో ప్రయోజనాలను అందించే విషయంలో ఈ స్కీమ్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు తక్కువ మొత్తంలో చేసే పొదుపు దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.