భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఇండియన్ నేవీ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. joinindiannavy.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

దేశానికి సేవ చేయాలని భావించే నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. 2023 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసైన వాళ్లు ఇండియన్ నేవీ చీఫ్ మేట్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా రిజర్వేషన్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. మొత్తం 100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష జరగనుందని సమాచారం అందుతోంది.

రాతపరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకుని అర్హత ఉన్నవాళ్లు సులువుగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండగా భారీ వేతనంతో ఉద్యోగం సాధించాలని భావించే వాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.