శరీరంపై కాలిన గాయాలు, బొబ్బలు త్వరగా మానాలా.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

మన శరీరంపై ఏదైనా చిన్న గాయం అయితే ఆ గాయం వల్ల మనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఆ గాయాలు కాలిన గాయాలు అయితే మరింత ఎక్కువగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. శరీరంపై కాలిన గాయాలు, బొబ్బలు త్వరగా మానవనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా వాటికి త్వరగా చెక్ పెట్టే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.

ఎండలో తిరగటం వల్ల కొంత మందిలో శరీరంపై బొబ్బలు వచ్చే అవకాశాలు ఉంటాయి. శరీరంపై ఏదైనా సందర్భంలో నిప్పు రవ్వలు పడటం వల్ల కూడా బొబ్బలు ఏర్పడే అవకాశం ఉంటుంది. రేడియేషన్ వల్ల కూడా శరీరంపై బొబ్బలు ఏర్పడతాయని చెప్పవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కలబంద గుజ్జును కాలిన గాయాలపై మందంగా రాయడం ద్వారా గాయాలు త్వరగా మానతాయి.

రోజుకు రెండు సార్లు ఈ రసాన్ని రాయడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. పసుపు పొడిలో తేనె కలిపి రాయటం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. కొబ్బరి టెంకను బాగా కాల్చి, దాని చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాయటం వల్ల కూడా గాయాలు త్వరగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గోరింటాకు ముద్దలో వెనిగర్ గానీ లేదంటే నిమ్మరసం గాని కలిపి గాయాలపై రాయడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

చర్మం కాలితే కాలిన చోట 10 నిమిషాల పాటు చల్లని నీటిని ధారలా పోసి పొక్కులు వస్తే వాటిని తొలగించకుండా అలానే ఉండాలి. తొలగిస్తే మాత్రం ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పవచ్చు. కోడిగుడ్డులోని తెల్లని సొనలో తుమ్మబంక పొడి , కొబ్బరి నూనె కలిపి పూస్తే కాలిన గాయాలకు ఉపశమనం లభించే ఛాన్స్ ఉంటుంది. కాలిన గాయాలని నీటితో శుభ్రపరిచి తరువాత మెత్తని పొడి బట్టతో గాయాన్ని తుడిచి టూత్ పేస్ట్ రాస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.