ఆడపిల్లల కోసం వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆడపిల్లలు పుడితే రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలను సైతం అందిస్తుండటం గమనార్హం. అయితే ఆడపిల్లల తల్లీదండ్రులకు ప్రయోజనం చేకూరేలా ఒక స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ పేరు భాగ్యలక్ష్మి స్కీమ్ కాగా ఆడపిల్లల తల్లీదండ్రులు ఈ స్కీమ్ ద్వారా ఎంతో బెనిఫిట్ పొందవచ్చు.
ఆడపిల్లల భ్రూణహత్యలను అరికట్టాలనే ఆలోచనతో ఈ స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ బిడ్డ పుట్టిన తర్వాత పేరెంట్స్ కోసం అమలు చేస్తున్న సబ్సిడీ స్కీమ్ కావడం గమనార్హం. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ను ఇతర రాష్ట్రాలలో సైతం అమలు చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పిల్లల భవిష్యత్తుకు ఈ స్కీమ్ ఎంతగానో మేలు చేసే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే 21 సంవత్సరాలు నిండిన ఆడపిల్ల 2 లక్షల రూపాయలు పొందవచ్చు. భారతీయ పౌరులు ఎవరైతే 2 లక్షల రూపాయల కంటే తక్కువ మొత్తంలో ఆదాయాన్ని కలిగి ఉంటారో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇతర ధృవీకరణ పత్రాలు అందించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
2006 సంవత్సరం మార్చి 31వ తేదీ తర్వాత పుట్టిన ఆడపిల్లలు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. ఆడపిల్ల పుట్టిన తర్వాత రూ. 19,300/ డిపాజిట్ చేస్తారు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత 1,00,097 రూపాయలు అందజేస్తారు. రెండో ఆడపిల్ల పుట్టిన సమయంలో 18,350 రూపాయలు డిపాజిట్ చేయడంతో పాటు రెండో ఆడపిల్లకు 1,00,052 రూపాయలు అందజేస్తారు.