హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా… ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిందే!

900x500_banner_HK-Connect_How-to-Improve-Heart-Health-_-Points-To-Keep-In-Mind

కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయంలో ఎంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు ఇలా భయంకరమైన అనారోగ్య సమస్యల బారిన పడి ఉన్నవారికి ఇబ్బందులు కలిగించుకున్న ఉండడం కోసం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు.ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ లో భాగంగా ఎలాంటి పాలసీలు తీసుకుంటే మంచిది ఎప్పుడు తీసుకుంటే మంచిది అనే విషయాల గురించి సరైన అవగాహన ఉండదు. అందుకే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఆందోళన చెందుతూ ఉంటారు.

ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.చాలా ఆలస్యంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకొని ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. మంది ఉద్యోగులు తాము పని చేస్తున్నంత కాలం యజమాని అందించిన వైద్య కవరేజీ సరిపోతుందని భావిస్తారని ఇది పూర్తి సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎంప్లాయర్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉండటం మంచిదేనని, క్లెయిమ్ చేయవలసి వస్తే, ముందుగా అందులో నుంచే చేయవచ్చని పేర్కొన్నారు. కానీ దానిపైనే ఆధారపడటం సరికాదని చెప్పాలి.

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరికి హెల్త్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి అయితే రిటైర్మెంట్ కి ముందు ఈ హెల్త్ పాలసీ తీసుకోవడం ఎంతో మంచిది. రిటైర్‌మెంట్‌ కు దగ్గరలో ఉన్నవారు ప్రత్యేకంగా మెడికల్‌ అవసరాలకు ఉపయోగ పడుతుంది..ఆస్పత్రిలో చేరే సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి. అవి కాకుండా తరచూ హెల్త్‌ చెకప్‌ల కోసం ఆస్పత్రులను సందర్శించాల్సి ఉంటుంది కనుక రిటైర్మెంట్ కి కొన్ని సంవత్సరాల ముందు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఎంతో మంచిది.