పాదాల పగుళ్లు సమస్యతో బాధపడుతున్నారా… ఇలా చేస్తే పగుళ్ళన్నీ మాయం!

సాధారణంగా శీతాకాలంలో ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా శీతాకాలంలో అధికంగా ఉంటాయి. ఇక చలికాలం వచ్చిందంటే చాలామందికి కాళ్లు చేతుల పగుళ్ల వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా పాదాలు పగుళ్లు కారణంగా చాలామంది నడవలేని పరిస్థితికి వెళ్లిపోతారు. ఇలా పాదాల పగుల సమస్యతో బాధపడేవారు కేవలం మన ఇంటి పరిసర ప్రాంతాలలో దొరికే మొక్కల ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

ఇలా పాదాల పగుల సమస్యతో బాధపడేవారు మన ఇంటి ఆవరణంలో దొరికే కరివేపాకు గోరింటాకుతో ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. తాజాగా ఉన్నటువంటి గోరింటాకు కరివేపాకు రెండింటిని సమానంగా తీసుకోవాలి.ఇలా ఈ రెండు ఆకులను బాగా మెత్తని మిశ్రమంలో తయారుచేసి ఈ మిశ్రమంలోకి మర్రిపాలను వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.రాత్రి పడుకునే సమయంలో కాళ్ళను బాగా శుభ్రం చేసుకొని కరివేపాకు గోరింటాకు మిశ్రమాన్ని కాళ్లకు రాసుకుని పడుకోవాలి.

 

మరుసటి రోజు ఉదయం కాళ్లను మరోసారి శుభ్రంగా కడగాలి. ఇలా వారం రోజులపాటు ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే సమయంలో కాళ్లకు రాయడం వల్ల పాదాల పగుళ్లు మాయం అవ్వడమే కాకుండా పాదాలు ఎంతో మృదువుగా తయారు అవుతాయి.గోరింటాకు కరివేపాకు లో ఉండే విటమిన్స్ ఇతర పోషకాలు పాదాల పగుళ్లను తగ్గించడమే కాకుండా మృదువుగా మారడానికి దోహదపడతాయి. ఇలా ఈ చిన్న చిట్కాలతో మీ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.