నోటిపూత సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… ఈ చిన్న చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి!

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇబ్బంది పడే సమస్యలలో నోటిపూత సమస్య ఒకటి.ఇలా కాలంతో సంబంధం లేకుండా ఈ నోటి పూత సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇలా నోటి పూత సమస్యతో బాధపడేవారు ఈ సమస్య నుంచి అధిగమించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఈ చిన్న చిన్న చిట్కాలతో ఈ సమస్యకు పూర్తిగా పెట్టవచ్చు. సాధారణంగా నోటిపూత సమస్య అనేది ఎప్పుడైతే మనం ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉన్నటువంటి పండ్లను తీసుకున్న సమయంలోనూ అలాగే మసాలా అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తిన్నప్పుడు అధిక ఒత్తిడి ఉన్నప్పుడు ఇలా నోటి పూత ఏర్పడుతుంది.

అదేవిధంగా ఎవరైతే ఎక్కువగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉపయోగిస్తూ ఉంటారో వారిలో కూడా నోటిపూత సమస్య తరచూ వస్తూ ఉంటుంది. ఐరన్ లోపం ఉన్న వారిలో కూడా ఈ సమస్య తలెత్తుతుంది.ఇక చాలామంది సరిగా బ్రష్ చేయకుండా నోటిని పరిశుభ్రంగా ఉంచుకోనప్పుడు నోటిపూత సమస్య బాధపడుతుంది అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తరచూ నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కొబ్బరి నీళ్లను కూడా అధికంగా తీసుకోవాలి.

నోటిపూత సమస్యతో బాధపడేవారు ఎక్కువగా పండ్లు కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. ఎక్కడైతే మనకు నోటి పూత ఏర్పడి ఉంటుందో ఆ ప్రదేశంలో చిటికెడు పసుపు తేనె కలిపి నోటి పూత వచ్చిన చోట అప్లై చేయడం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. వీలైనంతవరకు కారం మసాలాలను తగ్గించాలి.ఇక భోజనం చేసిన ప్రతిసారి నోటిని బాగా పుక్కిలించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడటమే కాకుండా ఇలాంటి సమస్య మరోసారి పునరావృతం కాకుండా ఉంటుంది.