జిడ్డు చర్మ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా! అయితే ఈ పేస్ ప్యాక్ తో సమస్యను తొలగించుకోండి!

సుగంధ ద్రవ్యాలలో ఒక్కటైన యాలకులు మసాలా దినుసుగానే కాకుండా మన చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఇందులోఉండే యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సీజనల్గా వచ్చే చర్మ అలర్జీలను, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.ఈ విషయం తేలిక చాలామంది మార్కెట్లో లభించే అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ విచ్చలవిడిగా వాడేస్తుంటారు. దాంతో చర్మంపై ఉండే సహజ నూనెలు నశించి పోవడమే కాకుండా చర్మం లోని మలినాలను విసర్జించే స్వేద గ్రంధులు మూసుకుపోయి చర్మ ఇన్ఫెక్షన్లు తలెత్తి ముఖంపై ముడతలు, మచ్చలు, దద్దులు, నల్లని వలయాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.

చర్మ సమస్యల నుంచి బయటపడడానికి యాలకులు చక్కటి పరిష్కార మార్గం చూపిస్తాయి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.తరచూ చర్మ సమస్యలతో బాధపడేవారు యాలకుల పొడిని పచ్చిపాలు మరియు తేనె మిశ్రమంలో కలిపి మెత్తని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మర్దన చేసుకునే ముందు చర్మాన్ని గోరువెచ్చ నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత యాలకుల మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకొని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై మూసుకుపోయిన స్వేద గ్రంధులు తెరుచుకొని మలినాలు తొలగించబడతాయి దీంతో ముఖంపై జిడ్డు తొలగి మచ్చలు , మొటిమలు, నల్లని వలయాలు తగ్గి ప్రకాశవంతమైన మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

తరచూ జిడ్డు చర్మంతో బాధపడేవారు కలబంద గుజ్జును ముఖంపై సున్నితంగా మర్దన చేసుకుంటే జిడ్డు చర్మం తొలగిపోతుంది.అలాగే కొబ్బరి నూనె పెరుగు, నిమ్మరసం సమపాలల్లో తీసుకొని మిశ్రమంగా కలుపుకున్న తర్వాత ముఖంపై ఫేస్ ప్యాక్ గా వేసుకుని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేర్కొన్న జిడ్డు కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.