సాధారణంగా ప్రేమ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఏదో ఒక క్షణాన చిగురిస్తుంది. అయితే చాలామంది ఈ ప్రేమలో సక్సెస్ అవుతారని నమ్మకం లేదు.ఇలా ఎంతోమంది తమ ప్రేమను విజయవంతంగా పెళ్లి బంధం వరకు తీసుకెళ్లి జీవితంలో సంతోషంగా ఉండగా చాలామంది తమ ప్రేమ విఫలం అయ్యి ఎంతో బాధపడుతూ అదే ధ్యాసలో ఉంటారు మరికొందరైతే ఏకంగా ఆత్మహత్యలు వంటివి కూడా చేసుకుంటున్న సంఘటనలను మనం చూస్తున్నాము.అయితే జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అయితే మనకు జీవితమే లేనట్టు కాదు కొన్ని సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడి కొత్తగా మన జీవితాన్ని మనం ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
లవ్ ఫెయిల్యూర్ అయిందన్న బాధలో ఉండడం సరైంది కాదు. అసలు మీరు ప్రేమలో ఉన్నారనే భావనలో నుంచి బయటకు వచ్చి మీ జీవితానికి కొత్త దారి వెతుక్కోవాలి.కొత్త దారి అంటే మరొకరితో వెంటనే రిలేషన్షిప్ కొనసాగించడం కాదు మీ జీవితాన్ని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించాలి.ఒకసారి మీ ప్రేమికుడు లేదా ప్రేయసి మిమ్మల్ని కాదంటే తిరిగి వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే వారి జ్ఞాపకాలు ఏవైనా మీ వద్ద ఉంటే వాటిని దూరం పెట్టేయాలి.
ఇలా లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు ఆ క్షణం మీకు ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి అలా కాకుండా ఏదైనా పనులు చేయాలనిపిస్తే చేయండి ఇలా చేయటం వల్ల మీరు ఆ బాధ నుంచి తొందరగా బయటపడతారు. ఇక మీరు రిలేషన్ లో ఉండి ఫెయిల్యూర్ అయ్యాం అనే విషయాన్ని ఎవరికీ చెప్పకండి.ఈ విషయాలన్నింటినీ పాటించిన తర్వాత కూడా మీరు ఆ బాధ నుంచి బయటపడకపోతే ఒకసారి నిపుణులను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవడం ఎంతో మంచిది ఇలా ఈ ప్రేమ విఫలమైన బాధ నుంచి బయటపడి మీ జీవితాన్ని మీరే అందంగా తీర్చి దిద్దు కోవాలి.