ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. పదో తరగతిలో పాస్ పర్సంటేజ్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఆఫ్‌లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండనుందని సమాచారం అందుతోంది.
ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు శారీరక దారుఢ్యం కలిగి ఉండి తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడం తెలిసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 సంవత్సరం జనవరి 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.63,660 వరకు వేతనం లభించనుంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదని తెలుస్తోంది. కమిషన్ సెక్రటరీ, ఏపీ రెగ్యులేటరీ కమిషన్, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ చిరునామాకు దరఖాస్తులను పంపాలి.
https://aperc.gov.in/admin/upload/notification_os_10jan24.pdf లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.