నిరుద్యోగులకు తీపికబురు.. నెలకు రూ.44 వేల వేతనంతో అనంతపూర్ లో ఉద్యోగ ఖాళీలు!

ఏపీలోని అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జిల్లాలోని బాలల సంరక్షణ అధికారి ఉద్యోగ ఖాళీ భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సోషల్ వర్క్ సోషియాలజీ చైల్డ్ డెవలప్మెంట్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సైకాలజీ పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్స్ లో ప్రావీణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 44,000 రూపాయల వేతనం లభించనుంది. ananthapuram.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నవంబర్ నెల 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి జిల్లా మరియు మహిళ శిశువు అభివృద్ధి సంస్థ ఈ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.