అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే!

ఈ మధ్య కాలంలో చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. రక్తంలో కొలెస్టెరాల్ ఎక్కువైనప్పుడు చర్మం, కళ్లల్లో కొన్ని ముందస్తు సంకేతాలు కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. మన శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.

అధిక కొలెస్టెరాల్ కారణంగా కనురెప్పలపై తెల్లని మచ్చలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమస్యను శాస్త్ర పరిభాషలో జాంథెలెస్మా అని అంటారు. కనురెప్పల చర్మంలో కొలెస్టెరాల్ పేరుకోవడంతో ఈ సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. రక్తంలో అధిక కొవ్వులకు ఇది సంకేతంగా భావించాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సమస్య బారిన పడితే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి.

కంటిలోని కార్నియా చుట్టూ తెల్లని వలయం ఏర్పడటం కూడా అధిక కొలెస్టెరాల్‌కు ఒక సిగ్నల్ అని చెప్పవచ్చు. 45 ఏళ్ల లోపు వాళ్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తాయి. హైపర్ లిపిడేమియా కారణంగా చర్మం రంగులో కూడా మార్పులు కనిపించే అవకాశాలు ఉంటాయి. కొలెస్టెరాల్ పేరుకోవడంతో ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది.

చర్మం కింద కొన్ని ప్రత్యేకమైన కణాల్లో కొలెస్టెరాల్ పేరుకున్నప్పుడు పసుపుపచ్చ రంగులో పింపుల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లిపిడ్ మెటబాలిజంలో లోపాలకు వీటిని సంకేతంగా భావించాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, నిత్యం అలసటగా అనిపించడం, నడుస్తున్నప్పుడు కాళ్లల్లో అకస్మాత్తుగా నొప్పి వచ్చి పోవడం వంటివన్నీ అధిక కొలెస్టెరాల్‌కు సంకేతాలు అని చెప్పవచ్చు.

అధిక కొలెస్ట్రాల్ సమస్య చిన్న సమస్యలా అనిపించినా దీర్ఘకాలంలో ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అయితే అన్నీఇన్నీ కావని చెప్పవచ్చు. అధిక కొలెస్ట్రాల్ కొన్ని సందర్భాల్లో కొత్త ఆరోగ్య సమస్యలను కూడా సృష్టించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.