నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా స్థిరమైన పెన్షన్ అందుకునే అవకాశం కల్పించడం కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగస్తులు ప్రతీ నెల కొంత మోత్తం ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. రిటైర్మెంట్ తర్వాత పెట్టిన మొత్తానికి మెరుగైన ఆదాయం, పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ స్కీమ్ ని ఎన్‌పీఎస్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.
ఈ స్కీమ్ లో ప్రతి నెల కొన్ని నిభందనలు మారుతు వస్తున్నాయి.. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి కొత్త నిభందనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవడానికి కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధన ప్రకారం చందాదారులు కొన్ని పత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. అలా చేయకపోతే.. వారు ఎన్‌పీఎస్ నుంచి డబ్బు డ్రా చేయటానికి వీలు ఉండదు. మారిన నిబంధనల ప్రకారం చందాదారులకు కేవైసీ పత్రాలు సమర్పించడమం తప్పనిసరి అని, ఈ పత్రాలను కచ్చితంగా అప్‌లోడ్ చేసేలా చూడాలని నోడల్ అధికారులు, చందాదారులను పీఎఫ్ఆర్డీఏ కోరింది.
అయితే ఈ పత్రాల్లో ఉన్న చందాదారుల వివరాలలో ఏవైనా తప్పులు ఉంటే వారి నిధులు నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నగదు విత్‌డ్రా చేసుకునే ముందు మీరు ఎన్‌పీఎస్ ఉపసంహరణ ఫారమ్‌ను అప్‌లోడ్ చేశారో లేదో ముందుగానే నిర్ధారించుకోవాలి. గుర్తింపు కార్డు, చిరునామా పత్రాల ప్రకారం ఉపసంహరణ ఫారమ్‌లోని సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతా ప్రూఫ్, పాన్ లేదా శాశ్వత పదవీ విరమణ ఖాతా నంబర్ కార్డ్ కాపీ కూడా ఉండాలి.. ఈ పత్రాలలో ఏ ఒక్కటి మిస్ అయిన డబ్బులు డ్రా చేయడం కుదరదు .