ఎయిర్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 495 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రాతపరీక్ష లేకుండానే ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోందని సమాచారం అందుతోంది. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది.
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు 80 ఉండగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉండగా రిజర్వేషన్ ఆధారంగా వయో పరిమితికి సంబంధించి సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 25980 రూపాయల వేతనం లభించనుంది.
జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు 64 ఉండగా ఇంటర్ లేదా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 23,640 రూపాయల వేతనం లభించనుంది. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 121 ఖాళీలు ఉండగా 28 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 25980 రూపాయల వేతనం లభించనుంది.
హ్యాండిమ్యాన్ విభాగంలో 230 ఉద్యోగ ఖాళీలు ఉండగా పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.21,330 వేతనంగా లభిస్తుంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.aiasl.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.