కాక్టస్ జాతి మొక్కలు ఎడారి ప్రాంతంలో పుష్కలంగా పెరుగుతాయి. ఈ జాతి మొక్కలు ఒళ్లంతా ముళ్ళతో
ఎందుకు ఉపయోగపడని చాలామంది అనుకుంటారు.
కాక్టస్ మొక్కల్లో చాలా రకాల జాతులు ఉన్నాయి. కొన్ని మొక్కలను ఇంటి ఆవరణలో ఇండోర్ ప్లాంట్స్ గా పెంచుకుంటాం. బ్రహ్మజెముడు లాంటి కాక్టస్ జాతి మొక్కలు అత్యధిక ఔషధ గుణాలు, పోషక విలువలతో కలిగి ఉండి మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అంటే ఆశ్చర్య పోవాల్సిందే.
కాక్టస్ మొక్కల్లో బ్రహ్మజెముడు వర్గానికి చెందిన చపాతి కాక్టస్ మొక్క మన ఆరోగ్యాన్ని రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీని ఆకులు చపాతి ఆకారంలో ఉంటాయి. అందుకే దీన్ని ఆ విధంగా పిలుస్తారు. ఈ మొక్క ఆకులు, పండ్లలో క్యాల్షియం, విటమిన్లు, మెగ్నీషియం, బీటాకెరోటిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ మొక్క పండ్ల జ్యూస్ మరియు జెల్లీ ప్రస్తుతం మార్కెట్లో కూడా దొరుకుతుంది.
ఈ మొక్క జ్యూస్ లో క్యాలరీలు తక్కువగా ఉండి పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి.అతి బరువు సమస్యతో బాధపడేవారు కాక్టస్ జ్యూస్ ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగడం వల్ల మన శరీర బరువును తొందరగా తగ్గించుకోవచ్చు
కాక్టస్ జాతి మొక్కల్లో విటమిన్ సి,అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. కావున ప్రతిరోజు ఉదయాన్నే ఈ మొక్క రసాన్ని సేవిస్తే వ్యాధి నిరోధక శక్తి నీ పెంపొందించుకోవచ్చు.
కాక్టస్ పండ్ల జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి క్యాలరీలు, గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.కావున దీన్ని ఎక్కువగా అథ్లెట్లు వాడుతారు.బాడీని త్వరగా డీ-హైడ్రేట్ అవ్వకుండా చేస్తాయి.
కాక్టస్ మొక్కలో అధిక శాతం ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలకు రుతుచక్ర సమయంలో ఏర్పడేటటువంటి నొప్పులకు మంచి ఉపశమనం లభిస్తుంది.
కాక్టస్ జ్యూస్ ప్రతిరోజు తాగడం వలన ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలు దృఢంగా ఉండునట్లు చేస్తుంది. మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె పనితీరును సరిచేస్తుంది.
జిడ్డు చర్మంతో బాధపడేవారు కాప్టర్ జెల్ తరచూ ముఖంపై మర్దన చేసుకుంటే జిడ్డుకు కారణమయ్యే సెబంమ్ ద్రావణాన్ని నియంత్రించి చర్మం కాంతివంతంగా ఉండునట్లు చేస్తుంది.
ఈ మొక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు మన శరీరంలోని వ్యాధికారకాలను తొలగించి కణాల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
ముఖ్య విషయం ఏమిటంటే కాక్టస్ జ్యూస్ తాగడం వల్ల కొందరిలో అలర్జీ సమస్యలు రావచ్చు అలాంటివారు ఈ జ్యూస్ కు దూరంగా ఉండటమే మంచిది.