పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు కాకి పదేపదే అరుస్తూ ఉందా… దాని సంకేతం ఇదే?

సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో వివిధ రకాల పక్షులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాగే కాకికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడి వాహనమైన కాకి మన జీవితంలో జరగబోయే సంఘటనలు గురించి ముందే సంకేతాలు ఇస్తుంది. అంతేకాకుండా చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో ఎల్లప్పుడూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారని ప్రజల నమ్మకం. అయితే కాకులు కొన్నిసార్లు పదే పదే మన ఇంటి ముందు అరుస్తూ ఉంటాయి ఇలా అరిచినప్పుడు మనం కాస్త కంగారు పడుతూ ఉంటాము.

ఇలా ఇంటి ముందు కాకి పదే పదే అరుస్తుంది అంటే ఏం జరగబోతుందోనని కంగారు కూడా ఉంటుంది అలాగే కొందరు మనం ముఖ్యమైన పనుల మీద ఇంటి నుండి బయటకు వెళుతున్న సమయంలో కాకి ఎదురు వచ్చి అరుస్తూ వెళ్తుంది ఇలా కాకి అరవడం దేనికి సంకేతం కాకి అరవడం మంచిదేనా అనే విషయానికి వస్తే….జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లే ముందు కాకి అరుస్తుంది అంటే అది శుభశకునంగా భావించవచ్చు. ఇలా అరుస్తూ కాకి ఎదురు రావడం వల్ల మనం చేపట్టిన పనులలో విజయం వరిస్తుందని సంకేతం. అయితే తరచూ కాకి అరుస్తూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే అదే అశుభంగా భావించవచ్చు. ఇలా ఇంటి చుట్టూ కాకులు అరుస్తూ తిరగటం వల్ల ఆ ఇంట్లో అశుభం జరుగుతుందని తెలిపే సంకేతం.

సాధారణంగా రోడ్డు మీద నడుచుకొని వెళ్లేటప్పుడు కాకులు మన తల మీద కాళ్లతో తన్ని పోతుంటాయి. అయితే పురుషులను ఇలా కాకి కాళ్లతో తన్నడం అనేది అశుభంగా భావించవచ్చు. ఇలా కాకి తలపై తనటం వల్ల ఆ వ్యక్తి అవమానాలు పాలవుతాడు. అయితే మహిళ తలపై కాకి ఇలా తన్నటం ఆమె భర్త ప్రాణాపాయంలో ఉన్నట్లు తెలిపే సంకేతం. ఇక మీ ఇంటి గోడ మీద కూర్చుని కాకి పదేపదే అరుస్తుంది అంటే మీ ఇంటికి ఎవరో చుట్టాలు రాబోతున్నారని సంకేతం.