లారెన్స్ “చంద్రముఖి 2” లో ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ ఎంపిక అయ్యిందా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రం “చంద్రముఖి” కూడా ఒకటి. భయానికి డెఫినిషన్ చెప్పిన ఈ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్. మరి ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని గత రెండు వారాల కితమే హీరో రాఘవ లారెన్స్ తో పార్ట్ 2 ని అనౌన్స్ చేయడంతో దీనిపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. 

అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇంకో టాక్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఈ సినిమాల్లో హీరోయిన్ సహా పలు లేడీ రోల్స్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో తెలిసిందే. అలాగే గతంలో జ్యోతిక మరియు నయనతార లు కీలక పాత్రల్లో నటించగా ఇప్పుడు ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ ఎంపిక అయ్యినట్టుగా తెలుస్తుంది. 

ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష అట. ఈ తరహా చిత్రాల్లో త్రిష ఇంతకు ముందు కూడా నటించింది అట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో కాలం నిర్ణయించాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.