షాకింగ్ : యష్ – శంకర్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి ఊహించని బడ్జెట్..?

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా కన్నడ రాకింగ్ స్టార్ హీరో యష్ నటించిన లాస్ట్ రెండు సినిమాలు “కేజీఎఫ్” సిరీస్ నిలిచాయి. అయితే ఈ సినిమాల దెబ్బతో మళ్ళీ యష్ ని రాకీ భాయ్ లా తప్ప మరోలా చూడలేని రేంజ్ పరిస్థితి నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత యష్ చేసే సినిమా ఏంటి అని పెద్ద ప్రశ్నే వచ్చింది. అయితే ఈ లైనప్ లో ఇండియన్ సినిమా గతిని మార్చిన దర్శకుడు శంకర్ తో యష్ సినిమా ఫిక్స్ అయ్యినట్టుగా కొన్ని ఊహాగానాలు ఉన్నాయి.

అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక హింట్ లేడీ కానీ ఈ కాంబోలో అయితే సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఉందని గట్టి టాక్ తమిళ సినీ వర్గాల నుంచి ఉంది. మరి ఇదిలా ఉండగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై ఇంకో ఊహించని సమాచారం తమిళ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా కేవలం యష్ తోనే ఉంటుంది అని దీనికి నిర్మాతలుగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అలాగే పెన్ స్టూడియోస్ వారు ఇంకా నెట్ ఫ్లిక్స్ కలిపి నిర్మిస్తున్నారని తెలుస్తుంది. మరి దీనికోసం వారు పెట్టె బడ్జెట్ వింటే కూడా దిమ్మ తిరగడం ఖాయం అని చెప్పాలి.

ఈ సినిమాకి ఏకంగా అయితే 1000 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నారని అంటున్నారు. మరి ఇంకా అధికారికంగా అనౌన్స్ కానటువంటి సినిమాపై ఈ రేంజ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకు నిజం అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.