చొక్కా ప్యాంటు విప్పేసి ఈ అవతారం ఏంటి సామీ

                                                          (సూర్యం)

కన్నడంలోనే కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఉపేంద్రకు మంచి మార్కెట్ ఉండేది. అవును ఒకప్పుడు ..ఆయన తెలుగులో స్ట్రైయిట్ సినిమాలు సైతం చేసారు. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలు భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కేవలం డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టుకుంటున్నాడు. కాకపోతే ఆ డబ్బింగ్ లు కూడా తెలుగు రీమేక్ లు అయినప్పుడు ఇక్కడ మేకులు దిగక తప్పటం లేదు. అయితే ఎంత ఆయనకు తెలుగులో మార్కెట్ లేకపోయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమాలు ఇక్కడ ఓ రేంజిలో ఆడటం మాత్రం ఆగలేదు.

 ఆ విషయాలన్ని ప్రక్కన పెడితే ఉపేంద్ర తాజా చిత్రం ఐలవ్ యు షూటింగ్ జరుపుకుంటోంది. చాలా కాలం హిట్ కు దూరంగా ఉన్న ఉపేంద్ర ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న  ఫొటో ఒకటి వదిలారు. ఈ కన్నడ-తెలుగు బై లింగువల్ సినిమాకు డైరెక్టర్ చంద్రు.


ఈ ఫొటో ఇప్పుడు కన్నడ పరిశ్రమలోనే కాదు తెలుగులోనూ సంచలనం సృష్టిస్తోంది. అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి చేసాక ఉపేంద్ర ని మళ్లీ తెలుగువాళ్లు గుర్తు చేసుకుంది ఈ సందర్బంలోనే. ఈ ఫొటో సెన్సేషన్ గమనించిన కొందరు అప్పుడే తెలుగు బిజినెస్ కోసం ఆయన్ను అడుగుతున్నారని వినికిడి. అదీ ఉపేంద్ర బిజినెస్ స్ట్రాటజీ అంటే.