రజినీ అడిగినా అందుకే ఛాన్స్ ఇవ్వలేదు..మణిరత్నం షాకింగ్ కామెంట్స్.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మరో మోస్ట్ అవైటెడ్ సినిమా అందులోని తమిళ్ సినిమా వారు ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రం “పొన్నియిన్ సెల్వన్”.

ఇండియన్ సినిమా దగ్గర తన సినిమాలతో అపారమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం తీసిన మొట్టమొదటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి ఎందరో బిగ్ స్టార్స్ కనిపిస్తున్నారు.

మరి ఈ భారీ సినిమా ఇప్పుడు ప్రమోషన్స్ జరుపుకుంటుండగా దర్శకుడు మని రత్నం కొన్ని షాకింగ్ కామెంట్స్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో చెయ్యడం ఆసక్తిగా మారింది. ఈ బిగ్ ప్రాజెక్ట్ లో రజినీకాంత్ చిన్న సపోర్టింగ్ రోల్ కి అయితే నేను చేస్తానని ఆయన అవకాశం ఇవ్వమన్నారని అడగ్గా..

నేను చెయ్యనని చెప్పేసానని మణిరత్నం చెప్పారు. అయితే దీనికి సరైన కారణం కూడా లేకపోలేదు. చిన్న సపోర్టింగ్ రోల్ లో సాధారణంగా చూపించి రజిని గారి అభిమానుల అంచనాలు తప్పకుండా అందుకోలేనని అందుకే రజిని గారు అడిగినాఅ కూడా చెయ్యనని చెప్పేసానని మణిరత్నం అసలు విషయం బయట పెట్టారు.