పేరు: వీర్రాజు, ఊరు: రావులపాలెం, పెళ్లాం పేరు: నిరంజన

‘పేరు: వీర్రాజు, గోదావరి జిల్లా, ఊరు: రావులపాలెం, పెళ్లాం పేరు: నిరంజన, కూతురి పేరు: శ్వేత దమ్ముంటే రారా’ అంటూ సవాల్ విసురుతున్నారు అజిత్. తమిళ స్టార్ హీరో అజిత్‌ దర్శకుడు శివ కాంబినేషన్ లో వచ్చిన మరో మాస్ ఎంటర్టైనర్ ‘విశ్వాసం’. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ రిజల్ట్ తెచ్చుకుంది. దాంతో ఆ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో అదే పేరుతో విడుదలకు సిద్ధంచేసారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది.

Viswasam - Official Telugu Trailer | Ajith Kumar, Nayanthara | Sathya Jyothi Films

ఈ ట్రైలర్ లో అజిత్‌ యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు పాత్రల్లో దుమ్ము రేపారనే చెప్పాలి. శివ గత సినిమాల్లో ఉండే యాక్షన్‌ సీన్స్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఇందులో ఆయా ఫైట్స్ ని తీర్చిదిద్దారు.

. నయనతార, జగపతిబాబు, వివేక్‌, తంబి రామయ్య, యోగిబాబు, రోబో శంకర్‌, కోవైసరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమాన్‌ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ పతాకంపై సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌లు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక అజిత్ – శివ కలయికలో మొదటి చిత్రం 2014లో వచ్చిన ‘వీరం’. ఈ చిత్రం ‘వీరం’ విజయాన్ని సాధించడంతో.. అజిత్ మరోసారి శివ పై నమ్మకముంచి ‘వేదలమ్’ అప్పగించారు. ఆ చిత్రం కూడా వసూళ్లు కురిపించింది. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కలయికలో ఈ సంవత్సరం వచ్చిన ‘వివేగం’ మాత్రం వర్కవుట్ కాలేదు.

హాలీవుడ్‌ స్థాయిలో ఈ సినిమాను రూపొందించినప్పటికీ ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అజిత్‌ అభిమానులే శివపై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లోనే మళ్లీ వీరి కాంబినేషన్‌లో నాలుగో సినిమా వచ్చి హిట్టైంది. మొత్తానికి వరుసగా నాలుగుసార్లు అజిత్‌ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు శివ గ్రేటే మరి.