ఓం శాంతి శాంతి శాంతిః యూనివర్శల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్: డైరెక్టర్ ఎఆర్ సజీవ్

Om Shanti Shanti Shantihi: మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 23న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎఆర్ సజీవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ నేపథ్యం గురించి?

-మాది వెస్ట్ గోదావరి, నిడదవోలు. డైరెక్టర్ సంకల్ప్, నందకిషోర్ దగ్గర పని చేశాను. అలాగే స్టాండ్ ఆఫ్ రాహుల్ సినిమాకి అసోసియేట్ గా వర్క్ చేశాను. చాలామంది దర్శకులతో రైటింగ్ టీం లో వర్క్ చేశాను.

-నాకు డైరెక్టర్ కావాలనే స్ఫూర్తినిచ్చింది వి వి వినాయక్ గారు. ఆయనది మా ఊరు పక్కనే. ఫస్ట్ టైం ఆయన్ని థియేటర్ విజిట్ లో చూసినప్పుడు అక్కడ ఆడియన్స్ ఆయనకు ఇచ్చిన రెస్పాన్స్ ని చూసి డైరెక్టర్ అవ్వాలనిపించింది.

ఇది ఒక రిమేక్ స్టోరీ కదా.. మీ మొదటి కథగా ఈ సినిమా చేయడానికి కారణం?

-అది ప్రొడక్షన్ వైపు నుంచి వచ్చిన అవకాశం. 35 చిన్న కథ సినిమాకి డైరెక్టర్ నందకిశోర్ గారితో కలిసి పని చేశాను. ఇదే ప్రొడక్షన్ హౌస్ లో నా సొంత కథ అడిగారు. అయితే ఒక రెండు నెలల తర్వాత ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లాంటి ఒక పెద్ద టీం తో నా ఫస్ట్ సినిమా చేయడమైనది అదృష్టంగా భావిస్తున్నాను.

తెలుగు విషయానికొచ్చేసరికి ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు?

-ఆ కథలోని కోర్ పాయింట్ ని తీసుకున్నాను. ఇది యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే కథ. అక్కడికి ఇక్కడికి కల్చర్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్ ని గోదారి ప్రాంతానికి మార్చాము. దాదాపుగా 60% కథని మార్చాము. చివరి 30 నిమిషాలు కొత్త కథలాగే అనిపిస్తుంది. ఫైట్ ఒకటే కామన్ గా ఉంటుంది కానీ మిగతాదంతా కొత్తగా ఉంటుంది.

తరుణ్ గారు ఆల్రెడీ పాపులర్ డైరెక్టర్ ఆయన్ని డైరెక్ట్ చేసినప్పుడు ఆయన ఇచ్చిన సపోర్ట్ ఏమిటి?

-ఆయన చాలా మోరల్ సపోర్ట్ చేశారు. ఆయన దగ్గరే అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలి అనుకున్నాను. అలాంటిది ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఫస్ట్ డే షూట్ కాస్త టెన్షన్ పడ్డాను. కానీ తర్వాత ఆయన నన్ను చాలా కంఫర్ట్ గా చూసుకున్నారు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయనకి ఫైనల్ కాపీ మాత్రమే చూపించాను. మధ్యలో రఫ్ కట్టు కూడా చూపించలేదు. మూవీ చూసి చాలా మెచ్చుకున్నారు.

– తరుణ్ గారు ఈ సినిమాలో గోదారి యాస మాట్లాడడానికి చాలా ప్రిపేర్ అయ్యారు. చాలా హోంవర్క్ చేశారు నిజంగా ఆయన ఆయాసలో పలికే డైలాగులు చాలా సర్ప్రైజ్ గా ఉంటాయి. తరుణ్ అన్న అనగానే మనకి తెలంగాణ స్లాంగే గుర్తొస్తుంది. ఇందులో కంప్లీట్ గోదావరి యాసని ఆడియన్స్ చూస్తారు.

– సినిమా చూసి తరుణ్ గారు చాలా సర్ప్రైజ్ అయ్యారు. నాకంటే ఎక్కువగా ఆనందపడ్డారు.

మ్యూజిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

-ఒరిజినల్ నుంచి ఒక్క ట్రాక్ కూడా వాడుకోలేదు. కంప్లీట్ గా కొత్త మ్యూజిక్ చేయడం జరిగింది. ఒరిజినల్ కంటే తెలుగులో ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి. మొత్తం ఏడు పాటలు. అన్ని పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి.

-ఇది కంప్లీట్ గా కమర్షియల్ సినిమా. ఇవివి సత్యనారాయణ గారి సినిమాల్లో భార్యాభర్తల మధ్య ఉండే ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ ఏ విధంగా రన్ అవుతుందో ఈ సినిమాలో కూడా అంత చక్కని వినోదం కుదిరింది.

ఇందులో క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి?

తరుణ్ గారి క్యారెక్టర్ చేపల వ్యాపారం చేసే వ్యక్తి. ఒక చేప జీవితాన్ని మెటఫర్ గా తీసుకుని ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేయడం జరిగింది. చేపకి మనం ఫుడ్ వేసినప్పుడు అది పొడుచుకునే తింటుంది. తరుణ్ క్యారెక్టర్ ఆ ఊర్లో తన తండ్రి మామయ్యను చూస్తూ పెరిగిన క్యారెక్టర్. ఆ ఊరు తప్పితే అక్కడ మరో ప్రపంచం తెలియదు. అలాగే శాంతి పాత్రని క్యాషియో(జీడి)ని మెటాఫర్ గా తీసుకోవడం జరిగింది. మనం క్యాషియో నట్ ని తీసుకొని ఆ పండుని బయట పారేస్తాం. నిజానికి అది హెల్త్ కు చాలా మంచిది. అమ్మాయి ప్రాముఖ్యత ని తెలిజేసేలా ఆ క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఒరిజినల్ లో దర్శన గారికి కంటెన్ ఈషా గారి పాత్ర చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది.

-ఈ సినిమాలో దాదాపు అన్ని కొత్త సీన్లే ఉంటాయి. ఒరిజినల్ నుంచి జస్ట్ కోర్ ఐడియా ఒక్కటే తీసుకున్నాము మిగతా ట్రీట్మెంట్ అంతా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో బ్రహ్మాజీ గారితో పాటు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు పాత్రలన్నీటిలో మంచి ఫన్ వుంటుంది.

-39 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాను. అనుకున్న బడ్జెట్లో సినిమాని తీయడం జరిగింది. సినిమా నిడివి రెండు గంటల 11 నిమిషాలుగా వచ్చింది

– డ్రామా ఎమోషన్స్ విషయంలో ఒక దర్శకుడిగా నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను.

ఇండస్ట్రీలో ఈ సినిమా ఎవరు చూశారు?

సురేష్ బాబు గారు చూశారు. అలాగే తరుణ్ అన్న ఫ్రెండ్స్ అందరు చూశారు. అన్ని వైపుల నుంచి చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.

నెక్స్ట్ చేయబోయే కథల గురించి?

కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాటి గురించి ప్రయత్నించాలి. నాకు మంచి డ్రామా ఉన్న కథలు చేయడం ఇష్టం.

Public Reaction On Sankranthi Kamma Festival || Ap Public Talk || Chandrababu || Ys Jagan || TR