నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో గ్రూప్4 ఉద్యోగ ఖాళీలు!

దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. కాటన్ యూనివర్సిటీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వాచ్‌మెన్, గార్డెనర్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు వేర్వేరు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

cottonuniversity.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మే నెల 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పది పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కొన్ని ఉద్యోగ ఖాళీలకు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 12,000 రూపాయల నుంచి 52,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 38 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని బోగట్టా.

రిజర్వ్డ్ అభ్యర్థులకు 250 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగతా అభ్యర్థులకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. https://cottonuniversity.ac.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.