వీధుల్లో నగ్నంగా సెకిల్‌పై తిరిగిన అంద‌మైన‌ యువతి..కార‌ణ‌మేంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండ‌లేరు!

ఓ మహిళ బట్టలన్నీ విప్పేసి..రోడ్డుపై నగ్నంగా సైకిల్‌పై తిరిగింది. అయితే, ఆమె మానసిక స్థితి సరిగా లేదు అనుకోవద్దు. అంతా ఆల్ రైట్. ఇంకో విషయం ఏమిటంటే..ఆమె అలా తిరుగుతుంటే పోలీసులు కూడా అడ్డుకోలేదు. ఇంకా వెల్ డన్ అంటూ మెచ్చుకున్నారు. అసలు తను అలా ఎందుకు చేసింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా… ప్రశంసించడం ఏంటి? ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా… అయితే, ఈ స్టోరీ పూర్తిగా చదివేయాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే.. లండన్ కు చెందిన కెర్రీ బార్నేస్ అనే యువతి లండన్ వీధుల్లో ఒంటిపై బట్టలు లేకుండా షికారు చేసింది. ఆమెను అలా తిరుగుతుంటే ప్రజలు షాక్‌కు గురయ్యారు. పిచ్చిది అనుకున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లింది. వెంటనే అక్కడికి వచ్చి అదుపులోకి తీసుకోవడానికి సిద్దమయ్యారు. అయితే, ఆమె చెప్పిన కారణం విని పోలీసులు కూడా ఎమోషనల్ అయ్యారు. కెర్రీ సుమారు పది మైళ్లు నగ్నంగా సైకిల్ పై ప్రయాణించింది. అలా ఆమె చెయ్యడానికి కారణం ఏంటంటే..మానసిక ఆందోళనలు మనుషులను బలవన్మరణాల దిశగా పురిగొల్పుతున్నాయి. ఒంటరి తనంతో కుంగిపోతూ.. బలహీన క్షణాల్లో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇటీవల మానసిక సమస్యతో ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ గణంకాలను చూసి ఆవేదన చెందిన కెర్రీ.. వారి కోసం ఏమైనా చేయాలని డిసైడయ్యింది. ‘మైండ్’ అనే మెంటల్ హెల్త్ చారిటీకి తన వంతు సాయం అందించేందుకు రెడీ అయ్యింది

మాములుగా డొనేషన్స్ అడిగితే జనాలు ఇవ్వరనే కారణంతో ఆమె ఊహించని నిర్ణయం తీసుకుంది. బట్టలు లేకుండా నగ్నంగా లండన్ వీధుల్లో తిరిగింది. మానసిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకొనేవారిని ఆదుకోవాలంటూ విరాళాలు ఇవ్వాలని కోరింది. ఆమెను చూసి జనాలు మొదట్లో షాక్‌కు గురైనా.. తర్వాత ఆమె మంచి మనసు చూసి సాయం చేయడం మొదలెట్టారు. పోలీసులు కూడా ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు.

చారిటీ కోసం ఏం చెయ్యాలని థింక్ చేస్తోన్న సమయంలో కెర్రీ ఫ్రెండ్స్.. ‘నెకేడ్ బైక్ రైడ్’ (నగ్నంగా సైకిల్ తొక్కు) అని ఆటపట్టించారట. అయితే, అది వారు సదరాగా చెప్పినా.. కెర్రీకి మాత్రం అదే కరెక్ట్ పని అని భావించిందట. వెంటనే ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చిందట. లాక్‌డౌన్ విధించిన రోజు నుంచి ప్రజలు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యల దిశగా వెళ్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె గర్వంతో చెబుతోంది. తొలుత ఈ నిర్ణయాన్ని ఆమె ఫ్రెండ్స్, బంధువులు వ్యతిరేకించారట. కానీ, ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని వారిని ఒప్పించిందట కెర్రీ బార్నేస్ . ఇప్పటివరకు ఆమె 7 వేల పౌండ్ల (రూ.6,89,543) విరాళాలు సేకరించింది. మరింతమంది స్పందిస్తారని ఆశిస్తోంది.